Wednesday, July 4, 2018

దక్షిణావృత శంఖం | Shankam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

దక్షిణావృత శంఖం | Shankam | Shanku | Panchjanya | Panchajanyam | Vishnu Shankam | Shankam | Puja | Homa | Aradhana | Harathi | Yajna | Yagam | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti


  సనాతన హిందూ సంప్రదాయ పూజా విధానంలో శంఖానికి విశేష ప్రాధాన్యం ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్ర మధనం చేసినప్పుడు ఈ శంఖం పుట్టిందని చెబుతారు. అప్పటి నుంచి పాంచజన్యంగా మహావిష్ణువు వామహస్తంలో ఒదిగిపోయింది. శంఖాన్ని లక్ష్మీదేవి తోబుట్టువుగా భావిస్తారు. 



   శంఖం రెండు పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అంటే జలం అని అర్థం. జలం ఉంచే మంచి కలశమే శంఖం. ఇందులో ఉంచిన నీటిని పవిత్ర తీర్థంగా ఉపయోగిస్తారు. దానిలో అనేక లవణాలు కరిగి ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యం కలుగుతుంది. దీనిని సంపదలకు ప్రతీకగా చెబుతారు.

నవవిధులలో, అష్టసిద్ధులలో శంఖాన్ని ఉపయోగిస్తారు. పూజ, ఆరాధన, అనుష్ఠాలలో, హారతిలో, యజ్ఞాలలో శంఖాన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేదరీత్యా దీనిలో మంచి గుణాలు ఉన్నాయి. పురాతన కాలంలో ప్రతి ఇంటిలోనూ దీనిని స్థాపించి ఆరాధించేవారు. కూర్మపీఠం మీద ఎప్పుడూ ఎరుపు పట్టు వస్త్రాన్ని వేసి దీనిని స్థాపించి, దేవతగా భావించి పూజించేవారు. ఈ పూజల వల్ల ఆర్థికవృద్ధి కలుగుతుందని నమ్మకం.
శంఖాలలో చాలా రకాలు ఉన్నాయి. రకాలను బట్టి పూజా విధానాలుంటాయి. శంఖం సాధకుని మనోవాంఛలను పూర్తి చేసి.. సుఖసంతోషాలను కలుగజేస్తుంది. శంఖాలు ముఖ్యంగా మూడు రకాలు. 

దక్షిణావృత శంఖం: ఎడమ చేతిలో పట్టుకునేది. వీటిని పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. 
మధ్యావృత శంఖం: మధ్యలో నోరున్నది. 

ఉత్తరావృత శంఖం: కుడి చేతిలో పట్టుకునేది. దీనిని ఊదడానికి వినియోగిస్తారు. శ్రీకృష్ణుడి పాంచజన్యం, అర్జునుడి దేవదత్తం ఉత్తరావృత శంఖాలే.

ఇవీ పేర్లు: లక్ష్మీ శంఖం, గోముఖం, కామధేను, దేవ, సుఘోష, గరుడ, మణిపుష్పక, రాక్షస, శని, రాహు, కేతు, కూర్మ శంఖం ఇలా ఎన్నో పేర్లున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో అనేకరకాల శంఖాలు పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యం, అర్జునుడు దేవదత్తం, భీముడు పౌండ్ర శంఖాన్ని పూరించారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి, ప్రతిష్ఠలకు, లక్ష్మీ ఆగమనాన్ని సూచిస్తుంది. అందుకే మన నిత్యపూజాదికాలలో శంఖాన్ని పూరించడం కూడా ఉంటుంది. శివపూజలో, హారతి సమయంలో, ధార్మిక ఉత్సవాలలో, శుభాశుభ సందర్భాల్లోనూ శంఖం పూరించే సంప్రదాయం ఉంది.

* శని శంఖానికి నోరు పెద్దదిగానూ, పొట్ట చిన్నదిగానూ ఉంటుంది. 
* రాహు,కేతు శంఖాలు సర్పాకారంలో ఉంటాయి 
* రాక్షస శంఖానికి అన్నీ ముళ్లుంటాయి. 
* ముత్యపు శంఖాలు మిలమిల మెరిసిపోతుంటాయి. 
* వినాయక శంఖం తొండంతో ఉంటుంది. 
* కూర్మ శంఖం తాబేలు ఆకారంలో, వరాహ శంఖం పంది ఆకృతిలో ఉంటాయి.

No comments:

Post a Comment