బ్రహ్మం గారి జీవిత చరిత్ర
-జవంగుల
Brahmam Gari Jeevitha Charitra
-Javangula Nagabhusana dasu
Rs 135/-
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1608-1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి, వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటివరకు జరిగాయి. జరుగుతున్నాయి.
బ్రహ్మం గారు సాక్షాత్ దైవ స్వరూపుడు. రాబోయే కాలంలో జరగబోయే విపత్తుల గురించి తన కాలజ్ఞానంలో సుస్పష్టంగా వివరించి, జనులందరిని సన్మార్గంలో నడువమని బోధించిన మహిమాన్వితుడు. చరిత్రకారుల కాలజ్ఞాన పరిశోధన ఫలితంగా, బ్రహ్మం గారు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయి అత్రి మహాముని ఆశ్రమంలో చేరుకున్నారు. కర్ణాటక లోని పాపాఘ్ని మఠాధిపతి యనమదల వీరభోజయచార్యులు, సతీ సమేతంగా సంతాన భాగ్యం కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ అత్రి మహాముని ఆశ్రమం చేరుకుంటాడు. సంతాన ప్రా్తి కై పరితపిస్తున్న ఆ పుణ్య దంపతుల చెంతకు, దైవ స్వరూపులు అయిన బ్రహ్మం గారిని అత్రి మహాముని అందజేస్తాడు. వీరభోజయాచార్య, ఈ బాలుడు, మహిమాన్వితుడు, మునుముందు, ఈ బాలుడు ఎన్నో వింతలు చూపించబోతున్నాడు అంటూ ఆ బాలుని వీరభోజయాచార్య దంపతులకు అందజేస్తాడు.ఆ విధంగా బ్రహ్మం గారు పాపాఘ్ని మఠాధిపతి గారింట సనాతన సంప్రదాయాల నడుమ పెరుగుతూ వస్తాడు. (ఈనాడు కర్ణాటక లోని పాపాఘ్ని మఠం బ్రహ్మం గారి ప్రథమ మఠంగా పేరు గాంచి దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్నది). అతి చిన్న వయసులోనే, బ్రహ్మం గారు కాళికాంబ పై సప్తశతి రచించి అందరిని అబ్బురపరుస్తాడు. బ్రహ్మం గారి పదవ ఏట వీరభోజయచార్యులు స్వర్గాస్తులవుతారు. అటు పిమ్మట దేశాటన నిమిత్తమై బయలుదేరబోతు తన తల్లి ఆశీర్వాదాలు కోరతాడు. అందుకు, వారి తల్లి, నాయన, వీరంభోట్లయ్య (బ్రహ్మం గారు చిన్న నాడు వీరంభోట్లయ్యగా పిలువబడ్డారు, పాపాఘ్ని ప్రస్తుత మఠాధిపతుల వద్ద దీనికి సంబంధించి శాసనాలు ఉన్నాయి), మఠాధిపత్యం స్వీకరించవలసిన నీవు ఇలా తల్లిని వదిలి పెట్టి దేశాటనకు బయల్దేరితే ఎలాగంటూ శోక సంద్రంలో మునిగి పోతుంది. అప్పుడు బ్రహ్మం గారు, తన తల్లి గారికి సృష్టి క్రమాన్ని వివరించాడు. స్త్రీ పురుషుల సంభోగం పవిత్ర కార్యమని, శుక్రశోణితంతో స్త్రీ గర్భ ధారణ గావించాక, గర్భం ధరించిన ప్రతి నెలలో, కడుపులో శిశువు ప్రాణం పోసే విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు బ్రహ్మం గారు. ఆగామి, ప్రారబ్ధ, సంచిత కర్మ సిద్ధాంతము గురించి వివరించి ఆమెకు మాయ తెరను తొలగించి, లోక కళ్యాణ నిమిత్తమై దేశాటనకు బయల్దేరతారు బ్రహ్మం గారు.
కర్నూలు జిల్లాలొని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలకుడిగా ఉంటు, రవ్వలకొండలో కాలజ్ఞానం వ్రాశారు. ఆవుల చుట్టూ గిరి గీసి రవ్వల కొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మం గారు. ఒకరోజు మిగతా గోపాలకులు ఈ విషయాలన్నీ చూచి భయపడి పరుగు పరుగున, అచ్చమ్మ గారికి ఈ విషయాన్ని చేరవేస్తారు. మరుసటి రోజున యథావిధిగా ఆవులను తీసుకుని వెళ్లి చుట్టూ గిరి గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావిస్తూ ఉన్న బ్రహ్మం గారిని చూసి ఆశ్చర్య పోతుంది అచ్చమ్మ. (అచ్చమ్మ బ్రహ్మం గారిని దర్శించుకున్న రవ్వలకొండలో ఈనాడు సుందరమైన బ్రహ్మం గారి దేవాలయం ఉన్నది). బ్రహ్మం గారి మహిమ తెలుసుకున్న అచ్చమ్మ, ప్రుట్టు గుడ్డి వాడైన తన కొడుకు బ్రహ్మానంద రెడ్డికి చూపు ప్రసాదించమని ప్రార్థిస్తుంది. బ్రహ్మం గారు తన దివ్య దృష్టితో, బ్రహ్మానంద రెడ్డి గత జన్మ పాపాలను దర్శించి, అతనికి చూపు ప్రసాదించి, పాప నివృత్తి గావించారు. గుహలో కూర్చుని వ్రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికీ భద్రంగా ఉన్నాయి. కాలజ్ఞానం వ్రాసిన తర్వాత బ్రహ్మంగారు కందిమల్లాయపల్లె చేరి వడ్రంగి వృత్తిచేస్తూ గడిపాడు. తనవద్దకు వచ్చినవారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అంతా సమసమాజం బాటన నడవాలని బోధించాడు.
జననం
బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబలకు, క్రీస్తు శకం 1608 లో జన్మించాడు . ఆయనను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. ఆయనకు చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు. పుత్రుని మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెను అనేక విధాలుగా అనునయించి జ్ఞానబోధ చేశాడు. ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని, వాటిని వదలమని తల్లికి హితవు చెప్పి ఆమె అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు.
తల్లికి చేసిన జ్ఞానబోధ
బ్రహ్మంగారికి ఆదిశంకరులు వలె దేశాటన ద్వారా జ్ఞాన సంపాదన చేసి, దానిని ప్రజల వద్దకు చేర్చడం అంటే మక్కువ ఎక్కువ. ఆయన తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా 'నేను' అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.
కాలజ్ఞానం పద్యాలు
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి విశ్వరూపం
శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము
(ముక్తి మార్గము భక్తి మార్గము పుస్తకములో నుండి కొన్ని పద్యాలు)
వీరబ్రహ్మము యొక్క వేద వాక్యంబులు
ధరణిలో తప్పక జరిగేనయా
కలిమాయలో పడక నన్ను నమ్మియు మీరు
కడతేరు మార్గంబు వెతకండయా!
స్వయముగా వెలిగేటి శక్తి దేనికి లేదు
సర్వేశ్వరుని తప్ప తెలియండయా
సూర్యచంద్రాదులు, సర్వగ్రహంబులు
ఆ వెలుగుతో వెలుగుచున్నారయా!
అనంత విశ్వములో ఈ గోళమెంతరా?
ఇందులో వున్నట్టి నీశక్తి యెంతరా?
సర్వమును కాపాడు సర్వ శక్తిని నీవు,
శరణు బొందుటే నీదు ధర్మంబురా!
వచ్చింది తెలియదు పోయేది తెలియదు
మధ్యలో మనబ్రతుకు ఏమౌనో తెలియదు
ఏమి తెలియని జన్మ కెందుకుర గర్వంబు
అందరిని కాపాడు ఆధి పురుషుని నమ్ము!
నాది నాది యనుచు గర్వించి చెప్పేరు
తల్లి గర్భము నుండి ఏమి తెచ్చారు
ఆరు అడుగుల నేల అందరిని పూడ్చుటకు,
అదియును మీదని ఎవరు చెప్పారు?
సముద్రాలు పొంగేట్టు గాలులే కదిలేట్టు
చేసే మహా శక్తి మనిషిలోను ఉంది
నీలోని శక్తిని భక్తితో ధ్యానింప
ఆదైవ దర్శనము కలిగేనయా!
దానంబు చేయకే దరిద్రులయ్యేరు
దైవమును నిందింప ఫలమేమయ
పదుగురికి ధర్మంబు చేసిన పుణ్యమే
జన్మ జన్మకు వెంట వచ్చేనయా!
బాహ్యా విషయములకై పరుగెత్తినావంటె
యేడ్పించి నీపై స్వారి జేసేను
పరమాత్మ వైపున మనస్సు నిలిపావంటె
ప్రకృతే నీపాద సేవ జేసేను!
దైవ ధ్యానము కన్న మించినది లేదయ
అనంత శక్తులు అందులో ఉన్నాయి
అష్ట కష్టంబులకు, కఠిన రోగంబులకు
దివ్యౌషధంబని నమ్మండయ!
దైవ స్వరూపుడవు నీవేనురా
కోర్కెలతో మనిషివై పోయావురా
కొరగాని కోర్కెలను కట్టి పెట్టిన నీవు
కోదండ రాముడై వెలిసేవురా!
వల్లకాటికి పోవు ఒళ్ళు వస్త్రాలను
బహు శుచిగ కాపాడుకొనియేరయ!
తమవెంట వచ్చేది మనస్సు బుద్దనుమాట
No comments:
Post a Comment