సర్వ రోగ నివారిణి.. కలబంద..!
కలబందను సంస్కృతంలో కుమారి అని పిలుస్తారు. ఎందుకంటే కలబంద చర్మాన్ని సంరక్షించి ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అందుకే దీన్ని కుమారి అని అంటారు. ఇక ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనకు కలిగే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ క్రమంలోనే రోజూ కొద్దిగా కలబంద గుజ్జును తిన్నా, లేదా జ్యూస్‌ను తాగినా దాంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. రోజూ కలబంద గుజ్జును తింటుంటే జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. జ్యూస్‌ను తాగినా ఇవే ప్రయోజనాలు కలుగుతాయి.
2. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేసే గుణాలు కలబందలో ఉంటాయి. అందువల్ల కలబంద గుజ్జు తిన్నా, జ్యూస్ తాగినా మధుమేహాన్ని నియంత్రించవచ్చు. మధుమేహం ఉన్నవారు రోజూ కలబందను తీసుకుంటే ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు.
3. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం అంతర్గతంగా శుభ్రం కావాలంటే రోజూ కలబందను తీసుకోవాలి.
4. నేటి తరుణంలో చాలా మందిని అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురి చేస్తున్నది. అధిక బరువు ఉన్న వారు రోజూ కలబందను తీసుకుంటే ఫలితం ఉంటుంది. శరీర మెటబాలిజాన్ని పెంచి కొవ్వును కరిగించే గుణాలు కలబందలో ఉంటాయి. అందువల్ల అధిక బరువు త్వరగా తగ్గుతారు.
5. కలబందను రోజూ తీసుకోవడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలో నాశనమైన కణజాలం పునరుద్ధరింపబడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
6. శరీరంలో ఏర్పడే క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు కలబందలో ఉంటాయి. కలబందను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది. నొప్పులు, వాపులు తగ్గుతాయి. కలబందలో ఉండే యాంటీ ఇన్‌ప్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి.
7. నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించాలంటే అందుకు కలబంద తోడ్పడుతుంది. కలబంద జ్యూస్‌ను తాగినా, గుజ్జును తింటున్నా శరీరం మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో మనకు సంపూర్ణ పోషణ కలుగుతుంది. పోషకాహార లోపం సమస్యను అధిగమించవచ్చు.
8. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని దాన్ని టూత్‌పేస్ట్‌పై వేసి దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలపై ఉండే పాచి, గార పోయి, దంతాలు తెల్లగా, దృఢంగా మారుతాయి.
9. కలబందను రోజూ తీసుకుంటుంటే చర్మం సంరక్షింపబడుతుంది. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు పోతాయి. అలాగే శిరోజాలు ప్రకాశంతంగా మారుతాయి. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది.

No comments:
Post a Comment