సాయినాథుడి పంచారామాలు
పంచారామాలు అనగానే పరమేశ్వరునికి సంబంధించిన ద్రాక్షరామం, భీమవరం మొదలైన క్షేత్రాలు గుర్తుకొస్తాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఆకుల అట్లూరు గ్రామంలో శిరిడి సాయిబాబాకు పంచారామాలు నిర్మించారు. ఐదు అంతస్తులుగా సాయి మందిరాన్ని నిర్మించారు. ప్రతి అంతస్తునూ ఓ భవ్య మందిరంగా తీర్చిదిద్దారు. అందులో సాయి సచ్ఛరిత్రను చాటే విధంగా అందమైన విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయిదో ఆరామంపై 108 అడుగుల ఎత్తున్న భారీ స్తూపాన్ని నిర్మించారు. దానిపై 25 అడుగుల ఎత్తున్న సాయిబాబా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైవిధ్యమైన నిర్మాణంతో అందరినీ ఆకర్షిస్తున్న ఈ సాయిధామం.. ఆధ్యాత్మిక ప్రచారానికి వేదికగా నిలుస్తోంది. ఆలయం పీఠభాగంలో ఓ గది ఉంది. అందులో భక్తులు రాసిన సాయినామ కోటి పుస్తకాలను నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 28 కోట్ల సాయినామాలు రాసిన పుస్తకాలను ఇందులో నిక్షిప్తం చేయడం విశేషం.
- వై.వి.సత్యనారాయణ, ఈనాడు, ఒంగోలు
No comments:
Post a Comment