Sunday, July 8, 2018

హాస్యం పరమౌషధం! | humor |



హాస్యం పరమౌషధం!

హాస్యం అద్భుతమైన ఔషధం లాంటిది. మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. మనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది. నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యవంతమైన వ్యాయామంలో హాస్యం ముందు వరుసలో ఉంటుంది. సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నోళ్లు ఎడారిలో వేసినా బతుకగలరు. ఇంతకూ ఏముంటుంది హాస్యంలో అంటే.. పొర్లించి పొర్లించి పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తది. ఆముదం తాగినట్టున్న మొఖాలపై కూడా తేనె పూస్తది. కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా అనే సాదా పలకరింపుల్లో కూడా నవ్వు తెప్పిస్తది. వద్దు సరోజా.. వద్దమ్మా అని ఎంత ఆపుకొనే ప్రయత్నం చేసినా దొంగోడు దుంకినట్లు దబీల్‌మని నోరుదాటి దుంకేస్తది. ఫలానాదే జోకు.. ఫలానా వాళ్లు చేస్తేనే కామెడీ అనేదేముండదు. హాస్యానికి ఏదైనా అర్హమే. పరమౌషధం లాంటి హాస్యపు నవ్వుల పూలమాల మీ కోసం!!

-దాయి శ్రీశైలం, సెల్: 8096677035

హాస్యం ఎందుకు?: అల్లంరబ్బా లాంటి ఆరోగ్యకరమైనది హాస్యం. ఏముంది మనిషి జీవితం? అంతా అసహజత్వం అయిపోతున్నది. సంపాదించాలి.. సాధించాలి అనే రేసులో పడి ఒత్తిళ్లను అగ్గువకు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఉద్యోగ సమస్య.. వ్యాపార సమస్య.. తిండి సమస్య.. అన్నీ సమస్యలే. దీన్ని ఆసరా చేసుకొని మీకు ఆ సమస్యా? ఈ సమస్యా? జీవితంపై విరక్తి చెందారా? మమల్ని సంప్రదించండి అంటూ సొమ్ము చేసుకొనే సంస్థలూ పుట్టుకొచ్చాయి. అవన్నీ ఎందుకు? సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించొచ్చు. ఇదొక లాజికే కాదు మెడిసిన్ కూడా! 

ఊపెకుహ: కోతిని మనం చూసి కికిక్కిక్కి అని అరిస్తే కామెడీ కాదు. ఆ కోతే మనల్ని చూసి కిర్క్‌కిర్క్‌మని ఇకిలిస్తే అది అసలైన కామెడీ. చాలా కోతులు మనుషుల్ని చూసి ఇట్లానే నవ్వుతాయి. ఏమో మనిషిని చూస్తే దాని ప్రతిబింబం చూసుకున్నట్లనిపిస్తదేమో కోతికి. అన్నట్టు జంతువులకు కూడా హ్యుమర్ సెన్స్ చాలా ఉంటుందట. గాడిద ఆఁ.. ఆఁ అని అరిచినప్పుడు ఒంటె మస్తు నవ్వుతదంట. అప్పుడు ఒంటె ఆకారాన్ని చూసి గాడిద పెద్ద.. ఇది సక్కగున్నట్లు నేను అరవంగనే ఆగమాగమైతుంది అనుకుంటదట. దీనికి సంబంధించి గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే.. ఒంటె అందానికి గాడిద మూర్చ పోయిందట అనే ఓ సామెత కూడా ఉన్నది. వీటి ముచ్చట చూస్తుంటే ఊర్లో పెండ్లికి కుక్కల హడావుడి (ఊపెకుహ) అనేది గుర్తొస్తది.

హ్యూమర్ లభించును!: రాజన్నొచ్చినాడు. పెండ్లికొడుకు రాంబ్రహ్మమొచ్చినాడు. ఓసారి మెరుపు తీగలెక్క వొచ్చిపోమ్మా అని పిలవగానే ముఖాన్ని నిండా కప్పేసుకొని మెరుపుతీగ లెక్క వచ్చిందో అమ్మాయి. అమ్మాయినేమైనా అడగదల్చుకున్నారా? అని అడిగితే.. జోక్స్ వేయడం వచ్చేమో అడగండి అనేంత తప్పనిసరి అయింది హాస్యం పరిస్థితి. ఎలాంటి భర్త కావాలి అమ్మాయ్? అని అంటే.. చాలామంది సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాడు కావాలి అని చెప్పే రేంజ్‌కు వెళ్లింది. ఐ వాంట్ ఏ పర్సన్ హూ మేక్ మి లాఫ్ అనే ఆలోచనా విధానం ఈ తరం అమ్మాయిల్లో కనిపిస్తున్నది.


పెండ్లి జోక్స్హాస్యం నిజంగానే ఔషధం లాంటిది. హ్యూమర్ సెన్స్ ఉంటే ట్యూమర్స్ సైతం తొలగిపోతాయంటుంటారు నిపుణులు. వెనకటి రోజుల్లో హాస్యం ఎక్కువగా సామెతలు, నానుడిలతో మిళితమై ఉండేది. పనికి, వర్గానికి సంబంధించిన హాస్యం బాగా పండేది ఆ రోజుల్లో. ఇప్పటి హాస్యం అప్‌డేటెడ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను, జీవన విధానానికి సంబంధించిన జోక్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. టెక్నాలజీ అంతకంతకూ విస్తరించడంతో హాస్యం రెడీమేడ్‌గా దొరుకుతున్నది. అలాంటి టెక్నాలజీపైనే వేసే జోకులు చాలా ఉన్నాయి. ఈ కింది జోక్ చదవండి మీకే తెలుస్తుంది. పెళ్లి మండపం. కాసేపైతే వరుడు తాళి కడతాడు. పెళ్లి కూతురు చాలా ఓపిగ్గా సుమారు 20 నిమిషాల పాటు తలెత్తకుండా నేలకేసి చూస్తూ కూర్చున్నది. ఆమెను చూసిన ఒకావిడ ఇలా అన్నది. ఏమండీ.. పెళ్లి కూతుర్ని చూశారా? భళే ముచ్చటేస్తుంది. ఏమా సంస్కారం. ఏమా ఒద్దిక. ఈ కాలంలో కూడా ఇలా తల దించుకొని కూర్చునే ఆడపిల్ల దొరకడం అదృష్టమేనండీ అన్నది భర్తతో. అబ్బోయబ్బా సంస్కారం. మళ్లొకసారి అదే పనిగా చూడు. ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఫేస్‌బుక్, వాట్సప్ చాటింగ్‌లలో బిజీగా ఉన్నది పెళ్లికూతురు అని చెప్పాడు. ఖంగుతిన్న ఆమె దీర్ఘంగా పరిశీలించగా అవే దృశ్యాలు కనిపించడంతో శెక్కరొచ్చి పడిపోయింది కాసేపు! 




అమ్మలక్కల జోక్స్ఎక్కడా రాని మజా.. ఎక్కడా పొందని హాస్యానుభూతి అమ్మలక్కల చమత్కారాలు.. చురకలు విన్నప్పుడు మాత్రమే దొరుకుతాయి. ఒక రకంగా ఆడవాళ్లు హాస్యానికి పండితుల్లాంటి వాళ్లు. కానీ బయటకు కనిపించరు. సందర్భం వస్తే మాత్రం ఏ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా బి.గోపాల్ సినిమాల్లో పేలే టాటా సుమోల్లా పేలుస్తుంటారు. భర్తను బండకేసి రాకాలన్న కసి ఉన్నా దానిని హాస్య సంభాషణల ద్వారా వెల్లడిస్తుంటారు. అలాంటి ఒక జోక్ చదవండి. ఒకావిడ ఎన్నడూ లేనిది చాలా హుషారుగా వాళ్ల కాలనీలో స్వీట్లు పంచిపెడుతూ ఉంటుంది. పుణ్యానికొచ్చిన స్వీట్లు లట్టలట్ట లొట్టలేసుకుంటూ తింటారు తప్పితే ఎవరూ ఏం విశేషమని అడగరు. కానీ ఆమెతో క్లోజ్‌గా ఉండే ఒకరిద్దరు ఇలా అడుగుతారు. 
ఏం వదినా.. అన్నయ్య మందు మానేశాడా ఏంది? జోరుగా స్వీట్లు పంచుతున్నావ్ అన్నారు. ఆఁ.. మందుదేముంది లే వదినా.? ఇయ్యాల కాకపోతే రేపు మానేస్తాడు. అంతకంటే మంచి పనే చేశాడొకటి అంటుంది. ఏంటా మంచిపని? మాతో చెప్తే మేమూ సంతోషిస్తాం కదా అంటారు వాళ్లు. అదే వదినా.. మీ అన్నయ్య తన ఫేస్‌బుక్ అకౌంట్ డీయాక్టివేట్ చేసేశాడు. నేటి నుంచి ఆయన జనజీవన స్రవంతిలో కలిసినట్టే అంటూ ఆనందం వ్యక్తం చేస్తుంది. మంచి మంచోళ్లు ఫేస్‌బుక్ అకౌంట్ క్లోజ్ చేసుకుంటున్నారు. మా ఆయన ఎప్పుడు చేస్తారో? మమ్మల్ని ఎప్పుడు పట్టించుకుంటారో అని ఆ మహిళలు లోలోపల గొణుక్కుంటూ లోపలికి వెళ్తారు!

మొగుడ్స్ పెళ్లామ్స్ఎన్ని జోక్స్ ఉన్నా.. భార్యాభర్తల జోక్సే బొర్ర కిర్రుమనేలా నవ్విస్తాయి. వెనకటి రోజుల్లో అయితే కోడి మీద.. పిల్లి మీద పెట్టుకొని ఒకరికొకరు జోక్స్ వేసుకునేవాళ్లు. ఒకరకంగా ఒకరినొకరు తిట్టుకోవడానికి ఈ సెటైర్లు పనికొచ్చేవి. ఈ పిల్లికేం పన్లేనట్టుంది. బిర్గ తిని ఇర్గ పండుకుంటది అర్రల. బైటికి పోతే ఏమాయెనే దొంగపిల్లి అని భార్య ఇన్‌డైరెక్ట్‌గా భర్తపై సెటైర్లు వేస్తే.. నేనేం తక్కువ తింటానా అంటూ భర్త.. ఈ కోడిని కొయ్యవెట్ట. ఊకె కొక్కరిస్తుందేందిరో. బిడ్డా ఇట్లనే ఒర్రితే కత్తిపెడ్త సూడు అని భార్య నోరు మూయించే ప్రయత్నాలు చేస్తుండేవాళ్లు. 
అలాంటి ఒక పవర్‌ఫుల్ పంచ్ ఒకటి చూద్దాం. 
ఆరాం కుర్చీలో హాయిగా కూర్చొని పేపర్ చదువుతున్న భర్త కాఫీ తీసుకురమ్మంటే భార్య ఇంకా తీసుకురాలేదు. కోపం వచ్చి తిడతాడు. భార్య రివర్స్ తిడుతుంది. 
ఏయ్.. నువ్వు నాలోని జంతువును నిద్రలేపుతున్నావ్ అంటూ గట్టిగా గాండ్రిస్తూ అరుస్తాడు భర్త. 
లేవనీయండి. పిల్లికి ఎవరూ భయపడరు అంటూ అంతే స్పీడుతో సెటైరేస్తుంది భార్య. దెబ్బకు మనోడు నోరు సైలెంట్ అయిపోతాడు! 
డౌట్ క్లియర్ జోక్స్.. 
ఏమండీ.. శాంపిల్ అంటే ఏంటండీ అని డౌట్ అడుగుతుంది భార్య. 
ఎప్పట్నుంచి కాచుకొని కూర్చున్న భర్త.. ఇదే అదునుగా భావించి.. పెళ్లి చూపులప్పుడు నువ్వు నాకు చూపించిన వినయం లాంటిది అంటాడు. 
ఆవురావురుమని ఆకలితో వస్తాడు భర్త. 
ఏమోయ్ అన్నం పెట్టుకురా అంటాడు. హాఁ.. వస్తున్నా ఆగండీ అని ఐదు నిమిషాల తర్వాత అన్నం తీసుకొచ్చింది భార్య. 
అన్నంలో ఈ రాళ్లేంటి? రెండు కళ్లున్నది ఎందుకు? అంటాడు. ముప్పయ్ రెండు పళ్లున్నాయ్ ఆ మాత్రం నమిలి తినలేవా? అంటుంది. 
దెబ్బకు దెయ్యం వదిలినట్లు గబగబా తినేసి బయటకు వెళ్లిపోయాడు.

పరమానందం జోక్స్-బట్టలు తెల్లగా కావాలంటే బండకేసి బాగా రుద్దాలి. అలాగే, హాస్యం బాగా పండాలంటే కొన్ని సందర్భాల్లో అవతలివాళ్లను బండకేసినట్లు బాదాలి. అలాంటి జోక్ ఒకటి చూద్దాం. 
ఇద్దరు ఫ్రెండ్స్ మెడికల్ షాప్‌కెళ్తారు. ఏమైందో ఏమో అరేయ్ నీకు దమ్ముంటే దబ్బునం తీస్కొని రారా.. ఇజ్జత్ ఉంటే ఇస్త్రీ పెట్టె పట్టుకొని రారా అంటూ తిట్టుకుంటూ వస్తుంటారు. కొందరు.. ఏమైందిరా? పొయ్యేటప్పడు మంచిగనే పోతిరి. ఇప్పుడు ఒక్కటే గజ్జికుక్క కరిసినట్లు గట్ల మొత్తుకుంటరూ? అని అడిగారు. 
కాదంకుల్.. రెండు ప్యాకెట్ల కుక్క బిస్కెట్లు ఇవ్వు అని అడిగితే.. ఇక్కడే తింటారా? పార్సిల్ కట్టాల్నా అంటున్నాడు వాడు అని కోపంతో చెప్తారు! 
ఇలాంటిదే ఇంకొకటి తాజా పెళ్లి జోక్ చూద్దాం. 
-కొత్త దంపతులు ఏకాంతంగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటున్నారు. మాటల్లో మాట భార్య తనకొచ్చిన ఒక డౌట్ క్లియర్ చేసుకోవడానికి భర్తను ఇలా అడిగింది.. 
ఏంటండీ.. మాటిమాటికీ మీరు కట్టుకున్న లుంగీనే చూస్తున్నారు? అని అడిగింది భార్య. 
కట్టుకున్నదాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమ్మని నిన్న పెండ్లిలో పంతులు చెప్పాడు కదా అందుకే ప్రతీ క్షణం జాగ్రత్తగా చూసుకుంటున్నా అన్నాడు భర్త!

కిడ్డింగ్ జోక్స్అన్ని జోక్‌లు తమాషాగానే ఉన్నా.. సెపరేట్‌గా తమాషా జోక్‌లు కూడా ఉంటాయి. అప్పటికప్పుడు పంచ్‌లు వేసి హాస్యాన్ని పండించడమే కిడ్డింగ్ జోక్స్‌గా చెప్పుకుంటారు. రమేశ్, నరేశ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. రమేశ్ ఒకసారి నరేశ్ వాళ్ల ఇంటికెళ్తాడు. ఏరా.. నరేశ్ చాలారోజులకు మీ ఇంటికొచ్చాను. ఈ కప్పు చాయ్‌తోనే సరిపెట్టేశావేంట్రా? అంటాడు. 
చాయ్ సరిపోలేదారో? చెప్పు మరి ఇంకేం కావాల్నో? అంటాడు నరేశ్. 
కొరికి తినేలా ఏమున్నాయ్‌రా అంటాడు రమేశ్. ఆఁ?? ఉందిరా కరిచే కుక్క. వదిలి పెట్టమంటావా? అంటాడు. 
నీకో దండం నీ కుక్కకో దండంరా నాయనా. నేను పోతున్నా అంటూ సర్దుకుంటాడు. 
హాస్పిటల్లో ఒక జోక్.. 
హాస్పిటల్ నుంచి పేషెంట్ డిశ్చార్జి అవుతున్నాడు. డాక్టర్ పేషెంట్‌ను కలిసి.. ఇప్పుడు తేలిగ్గానే అనిపిస్తుందా? అంటాడు. 
పర్సు తడుముకుంటూ.. హాఁ.. చాలా తేలిగ్గానే అనిపిస్తుంది డాక్టర్ అంటాడు పేషెంట్. 
మరో సందర్భంలో.. 
ఇద్దరు యంగ్ ఫ్రెండ్స్. ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. 
ఏరా రాజు.. యోగాకు.. యోగానికి వ్యత్యాసం ఏంట్రా? అంటాడు రవి. 
ఏముంది? నువ్వు కామ్‌గా ఉంటే అది యోగా. అదే నీ భార్య సైలెంట్‌గా ఉంటే అది యోగం అంటాడు.

రివెంజ్ జోక్స్రివెంజ్ తీర్చుకోవాలనే ఫ్లోలో సూపర్ పంచ్‌లు వస్తుంటాయి. అలాంటి ఒక జోక్ చూద్దాం. 
భార్యాభర్తలు డీప్ సంభాషణలో మునిగి ఉంటారు. మాటల్లో పెట్టి కోరికల చిట్టా ముందర పెట్టొచ్చు అనేది ఆమె అభిప్రాయం. దొంగ సచ్చినోడు ఏమంటడో ఏమో అనుకుంటనే భయం భయంగా.. ఏవండీ.. పక్కింటి పార్వతిని వాళ్ల భర్త పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. మీరూ ఉన్నారు. ఎప్పుడు నామీదే అరుస్తుంటారు అన్నది. 
ఏదో బిస్కెట్ వేసేందుకే గాలం వేస్తుందని ముందే పసిగట్టిన భర్త.. మల్లా మొదలు పెట్టిందిరా భాగోతం అని లోలోపల గొణుక్కుంటూ వాళ్లాయనది పూల యాపారం కాబట్టి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. మరి నాది కారం యాపారమాయే. నిన్ను కూడా కారంలో పెట్టి చూసుకోమంటవా? అని కస్సుమంటాడు. 
నీ నోట్ల మన్నువడ అని లోలోపల అనుకుంటూ.. వద్దులెండి అంటుంది భార్య. 
ఇలాంటిదే ఇంకో జోక్ చూద్దాం.. 
వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటారు. రాజీ, నాకు హెడెక్‌గా ఉంది. కొంచెం టీ పెట్టరాదూ అంటాడు భర్త. 
అబ్బో నావల్ల కాదండీ. నేను పెట్టనుగాక పెట్టను. గొంతు నొప్పిని భరించలేకపోతున్నా. మీరే పెట్టుకోండి అంటుంది. 
కోపమొచ్చిన భర్త.. సరే ఒక పనిచేద్దాం. నాకు తలనొప్పి ఉంది కాబట్టి నువ్వు నా తల నొక్కు. నీకు గొంతునొప్పి ఉంది కాబట్టి నేను నీ గొంతు నొక్కుతా. పీడా వదులుతుంది అంటాడు. 
హా.. వద్దులెండి. నేను పెట్టుకొస్తా అంటూ కిచెన్‌లోకి పరుగులు పెడుతుంది రాజీ.

నాన్‌స్టాప్ నవ్వులునిన్ను ఎందుకు అరెస్టు చేశారు? అని అడిగాడు జడ్జి.
షాపింగ్ చేసినందుకు చెప్పాడు గంగులు.
అదేమంత నేరం కాదే దానికెందుకు అరెస్టు చేశారు? అడిగాడు జడ్జి.
షాపు తెరవకముందే షాపింగ్‌కు వెళ్లాను జడ్జిగారూ అని అమాయకంగా చెప్పాడు గంగులు.


చింటు: నాన్నా.. పక్కింటి వాళ్లు పిసినారులా? 
తండ్రి: అలా ఏం లేదురా. అవునూ నీకు డౌటెందుకు వచ్చింది? 
చింటు: వాళ్లబ్బాయి పావలా మింగాడట. ఆ మాత్రం దానికే వాళ్ళు అంతగా ఎందుకు ఏడుస్తున్నారు అని?

కొడుకు: నాన్నా.. ఈ రోజుతో నా చదువు పూర్తయింది. అన్ని రకాల కోర్సులూ పూర్తి చేశాను. 
తండ్రి: నా ఆస్తి కూడా కరిగింది. అన్ని రకాల అప్పులూ చేశాను.

షాపు యజమాని: మా స్వీట్ షాపులో పని చేయడానికి మీకున్న అర్హతలేంటి? 
సుబ్బారావు: నాకు షుగర్ ఉంది సార్!

తండ్రి ; మీ కొత్త టీచర్ పాఠాలు ఎలా చెబుతున్నారు రా?
కొడుకు: అన్నీ గాలి కబుర్లే నాన్నా! 
తండ్రి: అదేంట్రా, పాపం అట్లా అంటావు? 
కొడుకు: నిన్న ఆక్సిజన్ , మొన్న నైట్రోజన్, ఇవాళ్ల హైడ్రోజన్. మరింకేమనాలి?


ఎప్పటికీ మర్చిపోలేని సినిమా జోక్స్సినిమా అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. వినోదం కోసం సినిమాకు వెళ్లేవారు ఎప్పటికీ ఉంటారు. చాలా తక్కువమంది ఫైట్లు, పాటల కోసం వెళ్తుంటారు. అలాంటి కామెడీ సినిమా సీన్లలో ఎప్పటికీ మర్చిపోలేనివి కొన్ని చూద్దాం.

అహనా పెళ్లంటఈ సినిమా మొత్తం జోకులే జోకులు. దాంట్లో ఎప్పటికీ మర్చిపోలేని సీన్ మాత్రం కోట శ్రీనివాస్‌రావు కోడిని దూలానికి వేలాడదీసి దాన్ని చికెన్‌గా భావించి భోజనం చేయడం. 
పైగా.. ఆహా అద్భుతం అనే డైలాగులు. ఈ సీన్ చూసిన బ్రహ్మానందం కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నవా తింగరి సచ్చినోడా. రేపటి నుంచి బియ్యపు గింజలను భూతద్దంలోంచి చూస్తూ మంచినీళ్లు తాగరా కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడిలా ఆ మొఖం చూడు. పోతావ్ రరేయ్ నాశనం అయిపోతావ్ అంటాడు. సరిగ్గా అదే సమయానికి కోట శ్రీనివాసరావు బామ్మర్ది వస్తాడు. రారా బామ్మర్దీ తిందువురా అనగానే ఎన్నాళ్లకు ఇంత మంచిమాట అన్నావ్ బావా అంటూ సంబురపడిపోతాడు. ఇవాళ మా ఇంట్లో కోడికూర అని కోట అనగా.. ఏదీ అంటాడు బామ్మర్ది. వేలాడుతున్న కోడినే చికెన్ అని తెలిసి పిచ్చిలేసి నా రాజ్యం.. నా గుర్రం.. నా పట్టపురాణి అంటూ ఏవేవో మాట్లాడుతాడు. 


నవ్వు నాకు నచ్చావ్ఇది లవ్ స్టోరీనే అయినా పూర్తిగా కామెడీ టచ్ ఉంటుంది. వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ కార్‌లో వాటర్‌పార్క్‌కు వెళ్తుంటారు. తన కారు టైర్ పంక్చర్ కావడంతో లిఫ్ట్‌కోసం వేచి చూస్తుంటాడు బ్రహ్మానందం. అటుగా వస్తున్న వెంకటేశ్‌ను లిఫ్ట్ అడుగుతాడు. వాటర్ వెల్‌లోకి వెళ్లాక ఆర్తి వాళ్ల చెల్లెను రోలర్ కోస్టర్‌లో ఎక్కించుకొని చిన్న పిల్లవు చాలా జాగ్రత్తగా పట్టుకో. ఇంత భయం ఉన్నదానివి ఎందుకు వచ్చావ్. ఏమైనా భయమేస్తే నాకు చెప్పు అంటూ బిల్డప్ ఇస్తాడు. రోలర్ కోస్టర్ ఎక్కిన తర్వాత అది తిరిగే మెలికలకు బ్రహ్మీకి చుక్కలు కనిపిస్తాయి. ఆపండయ్యా ఆపండయ్యా అంటూ చిన్నపిల్లాడిలా మొత్తుకుంటాడు. ఆ అమ్మాయి మాత్రం ఎంజాయ్ చేస్తూ బ్రహ్మీ చెప్పిన డైలాగ్స్ గుర్తు చేసుకుంటుంది. 

ఢీదాదాగా పేరున్న శ్రీహరి సెటిల్‌మెంట్లతో వచ్చిన డబ్బులను లెక్కించేందుకు పెద్ద టీమ్ పెట్టుకుంటాడు. ఈ టీమ్‌కు పెద్ద మనిషి బ్రహ్మానందం. ముద్దుగా చారి అంటారు అంతా. కొత్తగా మంచు విష్ణు కూడా ఇక్కడ ఉద్యోగం కోసం వస్తే అరేయ్.. ఆ చారిగానికి వీడిని అప్పగించండ్రా అంటూ ఆదేశిస్తాడు శ్రీహరి అలియాస్ శంకరన్న. విష్ణును తీసుకొని సునీల్ బ్రహ్మీ దగ్గరకు వెళ్లి.. అరే చారీ.. రేపట్నుంచి వీడు నీతోనే ఉంటాడురా అంటాడు. శంకర్ వాళ్ల చెల్లె గురించి విష్ణు ఆరా తీస్తుంటే.. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావుగారూ అంటూ చెప్పే సన్నివేశాలు కామెడీతో కట్టిపడేస్తాయి. 


మన్మథుడునాగార్జున, సోనాలిబింద్రే ైఫ్లెట్‌లో పారిస్ వెళ్తారు. పారిస్‌లో వాళ్లను రిసీవ్ చేసుకునే వ్యక్తి ఇండియన్. అతని పేరు లవంగం. అదేనండీ బ్రహ్మీ. పారిస్‌లో పెక్ అనే పలకరింపుతో వారిని పరిచయం చేసుకుంటాడు. ఎలా ఉంది పలకరింపు అని నాగార్జునను బ్రహ్మీ అడుగుతాడు. మీరు మొఖం కడుక్కుంటే ఇంకా బాగుంటుంది అని నాగార్జున అనగానే ఆఁ.. అంటూ నోరెళ్లబెడుతాడు బ్రహ్మీ. 

సైవేణుమాధవ్ ఓ కాలేజీ గోడపై రాజకీయ నాయకుడి పేరు రాయిస్తుంటాడు. అన్నా ఇక్కడ రాయాలంటే పర్మిషన్ కావాల్నంట అని అంటే నల్లబాలు నాకిపడేస్తా అంటాడు. అరే ఓ పెద్ద పెద్ద అక్షరాలు రాయిర్రిబే. అరే ఏంరా ఉర్కుతుర్రూ.. ఆగుర్రిబే. ఒక్కొక్కని సక్లంముక్లం పెట్టి కొడ్త బిడ్డా. ఏంరా గుర్కాయించి చూస్తున్నవ్. గుడ్లల్ల పొడుస్త కొడుకా. మనమంటే దేత్తడి పోచమ్మగుడి. మీరేమన్న తీస్మార్కాన్లాబే. నేను దార్కార్ని అంటూ డైలాగ్స్‌తో పండించే కామెడీ ఎవర్‌గ్రీన్.

No comments:

Post a Comment