లోకక్షేమకరీ
శాకంభరీ
సృష్టిలోని ప్రకృతి వనరున్నింటినీ తరతరాలుగా మనం ఏదో ఒక రూపంలో ఆరాధిస్తూనే ఉన్నాము. దూరదృష్టితో వేల సంవత్సరాలక్రితం మహర్షులు మన ఆచారవ్యవహారాలను ఆధ్యాత్మికతతో జోడించి ఉపదేశించారు. వారు చూపిన బాటనే మనం అనుసరిస్తున్నాం. అలా ఉపదేశించిన ప్రకృతి ఆరాధనలో భాగమే శాకంబరీదేవి ఆరాధన.
శాకము అంటే తినేందుకు అర్హమైన ఆకులు, పువ్వులు, కాయలు, వేళ్ళు, కాండములు, కొమ్మలు, పండ్లు మొదలైనవి. వీటన్నింటినీ శాకములని అంటారని ‘‘అమరకోశం’’ చెబుతోంది. అటువంటి శాకములచేత అంకరించబడుతుంది కాబట్టి శాకంబరీ అయ్యిందని పెద్దలమాట!
No comments:
Post a Comment