Thursday, July 5, 2018

మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌ | metastatic cancer | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌ | metastatic cancer | Millet's | Protein Diet | Milkshakes | Juices | Soups | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti | Telugu Books | Telugubooks


మెటాస్టేటిక్‌కు డైట్‌ కూడా ముఖ్యమే!

      మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌... ఈ వ్యాధి అనేది ఒకటుందని దాదాపుగా ఎవరికీ తెలిసి ఉండపోవచ్చు. ప్రముఖ నటి సోనాలీ బింద్రే తనకు హైగ్రేడ్‌ మెటా స్టేటిక్‌ క్యాన్సర్‌ సోకిందని బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.అప్పటి నుంచి ఈ వ్యాధి చర్చనీయాంశంగా మారింది.

    మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌ అంటే... ప్రాథమికంగా మొదలైన చోట నుంచే క్యాన్సర్‌ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందడాన్ని అమెరికాలోని క్యాన్సర్‌ చికిత్సా కేంద్రాలు ‘మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌’గా నిర్వచిస్తున్నాయి. ఒక చోట మొదలైన క్యాన్సర్‌ కణాలు....అక్కడి లింఫ్‌ వ్యవస్థ ద్వారా చురుగ్గా శరీరమంతా వ్యాప్తి చెందుతాయి.

    కారణాలేంటంటే...మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌కు ప్రధాన కారణం.. జీవన విధానం. మారుతున్న, హానికరమైన జీవన శైలే ఈ క్యాన్సర్‌కు ముఖ్య కారణమని ఎన్నో అధ్యయనాలు తేటతెల్లం చేశాయి. ఇందులో ఆహారం, వ్యాయామాలది ముఖ్యపాత్ర. ఆరోగ్యవంతమైన, సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌ను దూరం చేయవచ్చు. మారుతున్న జీవనంతో పాటు ఆహారం తీసుకునే సమయాలు కూడా మారిపోతున్నాయి. సమయానికి మించి భోజనం చేయడం వల్ల శరీరంలో హానికారక క్యాన్సర్‌ కణాలు ఉత్పత్తి అవుతాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. ఇవే ఆహారపు అలవాట్లు మెటాస్టేటిక్‌ క్యాన్సర్‌కు దారితీస్తాయి.

    మెటాస్టేటిక్‌ను తెలుసుకోవడం ఎలా అంటే.. శరీరంలో ఎక్కడో ఓ చోట నొప్పిగా ఉండి, రాను రాను అది భరించలేనంత అధికమయి శరీరమంతటా వ్యాపిస్తుంది. ఇది క్రమంగా మానసిక, శారీరక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. కొందరికి నిద్ర సరిగా పట్టదు. మరికొందరిలో ఏకాగ్రత దెబ్బతింటుంది. కుంగుబాటుకు లోను కావడం, తీవ్ర ఒత్తిడికి గురవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.


      ఏం తినాలంటే..: పండ్లు, కూరగాయలు, ముడిధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారం తీసుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ వహించకూడదు.

* వారానికి మూడు సార్లు పప్పులను, బీన్స్‌ వంటి చిక్కుళ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.

*ప్రొటీన్‌ డైట్‌ తీసుకోవడం మంచిది.

* ఒకేసారి ఎక్కువ తినకుండా కొద్ది కొద్దిగా రోజుకు 5-6సార్లు ఆహారం తీసుకోవడం మంచిది.

* ద్రవ ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మిల్క్‌షేక్‌, జ్యూస్‌, సూప్‌లను ఆహారంలో భాగంగా ఎంచుకుంటే మంచిది.

* సాధారణ టీకి బదులుగా రోజుకు 2-3కప్పుల గ్రీన్‌ టీ సేవించడం ఉత్తమం.

* వ్యాయామం చేయడం తప్పనిసరి.

ఏం తినకూడదంటే..?

* చక్కెర ఎక్కువగా ఉన్న ద్రవాలు అంటే కూల్‌ డ్రింక్స్‌, ఫ్రక్టోస్‌ ఎక్కువగా ఉన్న డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

* ఉప్పు వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది.

* ఫాస్ట్‌ ఫుడ్స్‌, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, ప్రాసెస్‌ చేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

* ఆవు పాలతో తయారు చేసిన పదార్థాలన్నింటినీ దూరంగా ఉంచాలి.

వీటని పాటించే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించి వారి సలహాలు పాటించడం ఉత్తమం.

No comments:

Post a Comment