Sunday, June 17, 2018

సంస్కార చింతామణి | Samskara chinthamani | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

సంస్కార చింతామణి | Samskara chinthamani ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి  Dwibhasyam Subramanya sastry| GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
సంస్కార చింతామణి 
Samskara chinthamani
ద్విభాష్యం సుబ్రమణ్య శాస్త్రి
Dwibhasyam Subramanya sastry
1 Part - Rs 320/-
2 Part -Rs 320/-
3 Part - Rs 320/-
4 Part - Rs 320/-
5 Part - Rs 320/-


ప్రథమ భాగం.

విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, అగ్నిముఖప్రకరణము, గర్భాదానము, పుంసవనము, సీమంతము, జాతకర్మ, నామకరణము, అన్నప్రాశనము, చౌలకర్మ, ఉపనయన ప్రకరణము, వేదంవ్రతములు, స్నాతకవ్రతము, వివాహ ప్రకరణము, అక్షరస్వీకారము, దత్తపుత్ర స్వీకారము, ఆశీర్వచనప్రకరణము మొదలగు విషయములు క్రియావివరణ సహితముగా అపూర్వ వైదికాదరణ పొంది విద్యార్థులకు పాఠ్యపుస్తకముగా గుర్తించబడిన గ్రంథరాజము.

ద్వితీయ భాగం.
శ్రీ గణేశాథర్వశీర్షో పనిషత్, మహాన్యాసం, శ్రీ రుద్రనమకం, అన్న సూక్తం, సూర్య గ్రహారాధనం, నక్షత్రదేవతారాధనం, చంద్రగ్రహారాధనం, కుజగ్రహారాధనం, బుధగ్రహారాధనం, గురుగ్రహారాధనం, శుక్రగ్రహారాధనం, శనిగ్రహారాధనం.

తృతీయ భాగం.
సంస్కారములలో చివరిదైన ‘పితృమేథము’ను గూర్చి అపూర్వమైన రీతిలో అనేక ధర్మశాస్త్ర విషయములతో ‘దహనసంస్కారము’ మొదలు ‘ద్వాదశాహస్సు’ పూర్తి అగు వరకు ముఖ్యముగా అన్ని విషయములతో క్రియావివరణతో కలిగినది. ఇదివరలో పితృమేథమును గూర్చి ఇంతటి గ్రంథము వచ్చి యుండలేదు. వైదికులు అందరూ ఉపయోగించు రీతిలో అశౌచ, ధర్మశాస్త్ర, వైదిక విషయములలో వేరొక గ్రంథము చూడనవసరములేని రీతిలో, వివిధ విషయములతో ముద్రించబడియున్నది.

చతుర్థ భాగం.
మానవుడు భోగభాగ్యములు సకల సుఖములు అనుభవించుటకు ఆరోగ్యము దానితో పాటు ఆయుర్థాయము చాలా ముఖ్యము. మానవునకు 60, 70, 82,100 సంవత్సరములు వచ్చునప్పుడు అతనిని మృత్యువు కబళించుటకు ఎదురు చూచు చుండును. అట్టి సమయమున మన మహర్షులు చెప్పిన ప్రకారము యథావిధిగా 60 సంవత్సరాలకు ఉగ్రరథ శాంతి, 70 కి భీమరథ శాంతి, 82 కి సహస్రచంద్ర దర్శన శాంతి, 100 వచ్చుసరికి శతాభిషేకవిధి అనునవి ఆచరించినచో మానవులకు పరిపూర్ణ ఆయుర్థాయము, సంపూర్ణ ఆరోగ్యము కలిగి సుఖశాంతులు పొందగలరు అట్లే ప్రతీ సంవత్సరము వచ్చు జన్మదినమున ఆయుష్యహోమము ఆచరించినచో ప్రమాదములు, అనారోగ్యములు తొలగి పరిపూర్ణ ఆయురారోగ్యములు పొందగలరు.

5 భాగం 
     పుత్రకామేష్టి లేదా పుత్రకామేష్టి యాగం రామాయణంలో దశరథుడు జరిపిస్తాడు. దీని మూలంగా ఆ పుణ్యదంపతులకు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు.

      పుత్రకామేష్టి యజ్ఞం సనాతన ధర్మం లో కొడుకు పుట్టడానికి చేసే ఒక ప్రత్యేక యజ్ఞము. ఇది ఒక కామ్య-కర్మ. రామాయణము లో, వశిష్ఠ మహర్షి చెప్పగా దశరథ మహారాజు ఋష్యశృంగ ముని ఆర్ధ్వర్యంలో ఈ యాగాన్ని చేసారు.ఋష్యశృంగ ముని యజుర్ వేదంలో శ్రేష్ఠుడు. అందులోనే ఈ యజ్ఞానికి సంబంధించిన క్రతువు ఉంది. యజ్ఞం ముగిసిన తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమై ఒక పాయసపు పాత్రను దశరథ మహారాజుకి ఇస్తాడు. ఆ పాత్రలో ఉన్నపాయసాన్ని తన ముగ్గురి భార్యలకు పంచగా వాళ్ళకి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు మరియు శతృఘ్నుడు జన్మించారు.
-------------------------------
పుత్రకామేష్ఠి విధి

వాల్మీకి ఆశ్రమానికి నారదమహర్షి విచ్చేశాడు. అతనికి అన్ని సపర్యలూ చేశాడు వాల్మీకి. తర్వాత ఇలా ప్రశ్నించాడతన్ని.‘‘మహర్షీ! లోకంలో పరాక్రమ, జ్ఞాన సద్గుణాల్లో సర్వశ్రేష్టుడు ఎవరు? అటువంటి వ్యక్తి ఉన్నాడా? ఉంటే దయచేసి అతని గురించి వివరించండి.’’సమాధానంగా సన్నగా నవ్వాడు నారదుడు.‘‘ఇది నా వేడుకోలు స్వామీ! అనుగ్రహిం చండి.’’ చేతులు జోడించి నమస్కరించాడు వాల్మీకి. అతని హృదయవేదనను అర్థం చేసు కున్నాడు నారదుడు. చెప్పాడిలా.‘‘సద్గుణాల్లో సర్వశ్రేష్టుడు లేకనేం, ఉన్నాడు. అతని పేరు శ్రీరామచంద్రుడు. అయోధ్యను ఏలు తున్నాడు.’’ అన్నాడు. తర్వాత రామకథను సంగ్ర హంగా వివరించి, వెళ్ళిపోయాడు అక్కణ్ణుంచి. నారదుడు చెప్పిన రామకథను పదేపదే మననం చేసుకున్నాడు వాల్మీకి. అద్భుతం, అమోఘం అను కున్నాడు. అంతలో శిష్యుడు భరద్వాజుడు వచ్చాడక్కడకి. ఇద్దరూ స్నానానికి బయల్దేరారు. తమసానదిని సమీపించారు. దారిలో ఓ చెట్టు మీద క్రౌంచపక్షుల జంటను గమనించాడు వాల్మీకి. చాలా ఉల్లాసంగా ఉన్నాయవి. ప్రేమో న్మత్తంగా ప్రవర్తిస్తున్నాయి. అంతలో ఓ బాణం వచ్చి జంటలోని మగపక్షిని కూల్చింది. ప్రాణాలు కోల్పోయి చెట్టుపై నుంచి కిందపడింది మగపక్షి. దానిని చూసి ఆడపక్షి రోదించసాగింది. చూశా డది వాల్మీకి.జాలితో చలించిపోయాడతను. ఆవే దన చెందాడు. ఆ ఆవేదన ఆవేశమయింది. తల తిప్పి చూశాడిటు. తన బాణానికి నేల కూలిన పక్షికోసం పరుగున వస్తున్న బోయ కనిపించాడు. రక్తారుణనేత్రా లతో ఇలా శపించాడతన్ని.‘‘మానిషాద ప్రతిష్ఠాం త్వ, మగమః శాశ్వతీం సమాః,యత్‌ క్రౌంచ మిథునాదేక, మవధీః కామ మోహితమ్‌.’’‘‘ఓయీ బోయా! ప్రేమోన్మత్తమై ఉన్న ఈ జంట పక్షులలో ఒకదాన్ని చంపిన కారణంగా కల కాలం నువ్వు అప్రతిష్ట పాలవుదువుగాక.’’ముని శాపానికి భయపడ్డాడు బోయ. అక్క ణ్ణుంచి పరుగందుకున్నాడు. భయపడి పారి పోతున్న బోయని చూసి, తలవిదిల్చాడు వాల్మీకి. జాలి చెందాడు. శాంతించాడు. మధనపడ్డాడు.తనకేమయింది? ఎందుకిలా ప్రవర్తించాడు? అనుకున్నాడు. తర్వాత శాపాన్ని తలపోశాడు. చక్కని పదాల పొందికతో, రెండు సమపాదాలతో, శ్లోకమయిన తన మాటలకు తానే విస్తు పోయాడు వాల్మీకి. ఆ మానసికావస్థలోనే శిష్యుని సహా స్నానం ముగించుకుని, ఆశ్రమానికి చేరు కున్నాడు. మౌనంగా కూర్చున్నాడక్కడ. కళ్ళు మూసుకున్నాడు. జరిగిన దాని గురించి ఆలో చించసాగాడు.ఎవరో వచ్చిన అలికిడి అయింది. కళ్ళు తెరచి చూశాడు. సృష్టికర్త, చతుర్ముఖుడు సాక్షాత్తు బ్రహ్మ. సాక్షాత్కరించాడక్కడ. దేవతలతోనూ, ఋషులతోనూ తరలి వచ్చాడు. అతనికి చేతులు జోడించి, నమస్కరిస్తూ లేచి నిల్చున్నాడు వాల్మీకి.‘‘వాల్మీకీ! నువ్వెలాంటి పాపకార్యమూ చెయ్య లేదు. మంచిపనే చేశావు. చేసిన మంచిపనికి ఆనందించు. నా ఆదేశానుసారం, వాణి నీ వాక్కులో ప్రవేశించింది. దాని ఫలితమే శోకంతో నువ్వు పలికిన వాక్కు, శ్లోకరూపం దాల్చింది.’’ అన్నాడు బ్రహ్మ. అవునా! అన్నట్టుగా ఆశ్చర్య పోయాడు వాల్మీకి.‘‘నారదుడు చెప్పిన రామకథను నువ్విందాక పలికావే శ్లోకం, ఆ శ్లోక ఛందస్సులోనే కావ్యంగా రచించు. అది లోకకల్యాణకారకమవుతుంది. తర తరాలూ వర్థిల్లుతుంది.’’ఆనందంతో చలించిపోయాడు వాల్మీకి.‘‘నా అనుగ్రహంతో రామకథలోని పాత్రలు ఏఏ పనులు చేపట్టిందీ, వారేం మాట్లాడిందీ, ఎలా ఆలోచించిందీ అన్నీ నీ దివ్యదృష్టికి అందు తాయి. అలా అందడమేకాదు, నా ఆశీస్సులతో నువ్వు రచించిన మహాకావ్యం ఈ విశ్వం అంతటా వ్యాపించి, కులపర్వతాలూ, సాగరాలూ, సూర్య చంద్రులూ ఉన్నంతకాలం వర్థిల్లుతుంది. నీ కావ్యం సహా నువ్వు కూడా కీర్తిమంతుడ వవుతావు. తర్వాత మాలోకాన్ని అలంకరిస్తావు.’’ అన్నాడు బ్రహ్మ.‘‘దైవానుగ్రహం’’ అన్నాడు వాల్మీకి.తలవంచాడు. ఋషులూ, దేవతలుసహా బ్రహ్మఅదృశ్యుడయ్యాడు. బ్రహ్మోపదేశానికీ, ఆదేశానికీ ఆనందించి, వాల్మీకి రామకథను రచించేందుకు సిద్ధమయ్యాడు. ధ్యానమగ్నుడయ్యాడు. రామకథ అంతా అతని కళ్ళకు బొమ్మ కట్టింది.

-------------------

భారతీయ వైదిక సంస్కారములు 48
పితృ సంస్కారములు 8
1) గర్భాధానమ్ 2) పుంసవనమ్ 3) సీమంతమ్ 4) జాతకర్మ 5) నామకరణమ్ 6) అన్నప్రాశనమ్ 7.1) చూడాకరణమ్ (చౌలమ్) 7.2)కర్ణవేధ 8) ఉపనయనమ్

గురు సంస్కారములు 4
(ఉపాకర్మ) 9) ప్రాజాపత్య వ్రతం 10) సౌమ్య వ్రతం 11) ఆగ్నేయ వ్రతం 12) వైశ్వదేవ వ్రతం (గోదానమ్)

స్వ కర్తృక సంస్కారములు 7
13) స్నాతకమ్ 14) వివాహమ్ 15) దేవ యజ్ఞం 16) పితృ యజ్ఞం 17) మనుష్య యజ్ఞం 18) భూత యజ్ఞం 19) బ్రహ్మ యజ్ఞములు

పాకయజ్ఞములు 7
20) అష్టక 21) పార్వణ 22) మాసి శ్రాద్ధమ్ 23) శ్రావణి (సర్పబలి) 24) ఆగ్రహాయణి 25) చైత్రీ (ఈశానబలి) 26) ఆశ్వయుజి

హవిర్యజ్ఞములు 7
27) అగ్న్యాధేయం 28) అగ్నిహోత్రం 29) దర్శ పౌర్ణమాస్యలు 30) చాతుర్మాస్యలు (వైశ్వదేవ – వరుణ ప్రఘాస – సాకమేధ- సునారసీయములు) 31) ఆగ్రయణేష్టి 32) నిరూఢపశుబంధము 33) సౌత్రామణి

సోమయజ్ఞములు 7
34) అగ్నిష్టోమం 35) అత్యగ్నిష్టోమం 36) ఉక్థ్యం 37) షోడశీ 38) వాజపేయం 39) అతిరాత్రం 40) అప్తోర్యామం

ఆత్మగుణములు 8
41) దయా 42) క్షాంతి 43) అనసూయా 44) శౌచమ్ 45) అనాయసమ్ 46) మాంగల్యమ్ 47) అకార్పణ్యమ్ 48) అస్పృహా
-----------------------

సంస్కారములు 48 – వాటి వివరణములు

గర్భాధానమ్ – క్షేత్ర సంస్కార సిద్ధి (గర్భ: సంధార్యతే యేన కర్మణా తత్ గర్భాధానమిత్యనుగతార్థం కర్మనామధేయం.) ఏకర్మ పూర్తియైన పిమ్మట స్త్రీ పతిద్వారా తన గర్భమునందు శుక్రధారణము చేయుచున్నదో దానిని గర్భాధానమందురు. మానవుని జీవనము సంస్కారములకు క్షేత్రము. అట్టి మానవుని జనన కారకమైన గర్భక్షేత్రమును సంస్కరించుటయే గర్భాధాన సంస్కారము.

పుంసవనమ్ (పుమాన్ ప్రసూయతే యేన కర్మణా తత్ పుంసవనమీరితమ్. తచ్చ పుమాన్ సూయతే అనేన కర్మణేతి వ్యుత్పత్య పుంసూపతాపాదక: కర్మవిశేష:) ఏ సంస్కారము ద్వారా గర్భమునందలి పిండమునకు పుంరూపము సిద్ధించునో అది పుంసవనము. పుత్ర సంతానార్థము ఆచరించవలసిన గర్భ సంస్కారము. ప్రతి గర్భమునందు చేయవచ్చు.

సీమంతమ్ ( సీమంత ఉన్నీయతే యస్మిన్ కర్మణి తత్ సీమంతోన్నయనమితి కర్మనామధేయమ్) గర్భిణీస్త్రీని ఆవహించియున్న అమంగళకరమైన శక్తులను పారద్రోలుటకు గర్భిణియొక్క కేశములను ఎత్తిపెట్టి కట్టుటయే (సీమంత ఉన్నయనము) సీమంత సంస్కారము. ఇది ప్రథమగర్భమునందు మాత్రమేచేయు సంస్కారము.

జాతకర్మ ( ప్రాక్ నాభివర్ధతే పుంసో జాతకర్మ విధీయతే) శిశువు పుట్టిన తరువాత బొడ్డు కోయకముందు లేదా 11వరోజున చేయు సంస్కారము. పుత్ర జననంతో సద్యస్కాలమునందే తండ్రి పితృ ఋణమునుండి విముక్తుడై అమృతత్వాన్ని పొందునుగాన ఆత్మస్వరూపమైన పుత్రుణ్ణి అగ్నిసాక్షిగా స్వీకరించి శిశువునకు శ్వాస సక్రమంగా అందుటకు, గర్భాంబుపాన (ఉమ్మనీరు) దోషము తొలగించి, శిశువునావహించియున్న దుష్ట శక్తులను పారద్రోలి జన్మసంస్కారమును కల్పించుట.

నామకరణమ్ - జీవునికి ఆయుష్షు, వర్చస్సులతో కూడిన వ్యవహార సిద్ధి కలిగి వైదిక, లౌకిక కీర్తి (యశస్సు) కలుగుటకు శిశువునకు పేరుపెట్టుటకు చేయు సంస్కారము. 
అన్నప్రాశనమ్ – కుమారునకు (కుమార్తెకు) మాతృ గర్భ మలప్రాశన శుద్ధికలిగి దంతములు వచ్చు సమయంలో బ్రహ్మ వర్చస్సు, తేజములతో కూడిన ఇంద్రియాభివృద్ధి కలుగుటకు జననమైన ఆరవనెలలో (ఆడపిల్లలకు 5 లేదా 7వ నెలలో) తండ్రి బ్రాహ్మణ సంతర్పణము చేసి అన్నము తినుపించుటకు చేయు సంస్కారము. అన్నప్రాశనమైన పిమ్మట అన్ని కళలయందు ఉపయోగించు పనిముట్లను, శస్త్రాదులను పిల్లవాని ముందుంచి తాకునట్లుచేసి, ఏది త్రాకునో అది వాని జీవికను తెలియజేయునని అపరార్కుడు మార్కండేయ స్మృతినందు తెలిపెను. ఇది ప్రస్తుత ఆచారముగా కూడా ఉన్నది.

కర్ణవేధ - చెవులు కుట్టించుటయను సంస్కారము. దివ్యవర్చస్సు కలిగి, ఉత్తరోత్తర గురూపదేశ మన్త్రధారణ సిద్ధి కలుగుటకు, పితృదేవతల అనుగ్రహ నిమత్తము చేయవలసిన సంస్కారము. 

చూడాకరణమ్ (చౌలమ్) - చూడ అనగా శిఖ. ఇది ఉంచి మిగిలిన కేశములను వపనము చేయును. మూడవ సంవత్సరమున చేయు ఈ సంస్కారమును చూడాకరణము (చౌలము) అందురు. మానవుడు చేసిన కర్మఫలం ప్రతిజన్మలో వెంటవచ్చును. పాపము మాత్రము కేశములనాశ్రయించి ఉండును. కావున కేశవపనము చేయుటవల్ల జీవుడికి జన్మాంతర పాపోశమనము కలుగును. తండ్రి తన గోత్రమున ఎంతమంది ఋషులు కలరో అన్ని శిఖలుంచవలెను. ప్రస్తుతము పంచ (5)శిఖలుంచుట ఆచారము. ప్రస్తుతము చౌలమును ఉపనయనమునందు చేయుటయున్నది. 

ఉపనయనమ్ ఉపనయనమ్ - (ఉపనీతేః ఫలంత్వేతత్ ద్విజత్వా సిద్ధిపూర్వికా, వేదాధీత్యధికారశ్చ సిద్ధిర్ ఋషిభిరీరితా) ఈ సంస్కారము వలన మొదట ద్విజత్వము పిదప వేదాధ్యయన అధికారము సిద్ధించును. ఉపసమీపే నయనమ్ – నయనమ్ అనగా నేత్రమని పంపుటయని అర్ధములు కాన గురువు దగ్గరకు తన కుమారుడికి విద్యా సముపార్జనతో జ్ఞాన నేత్రోన్మీలమునకై పంపుట. 

(ఉపాకర్మ)

ప్రాజాపత్య వ్రతం

సౌమ్య వ్రతం

ఆగ్నేయ వ్రతం

వైశ్వదేవ వ్రతం

గోదానమ్

స్నాతకమ్ స్నాతకమ్ (సమావర్తనమ్) - (గురుకులాత్ సమావర్తనం యస్మిన్కర్మణి తత్ సమావర్తనమ్) అధ్యయన అనన్తరము ఆచార్యుని గృహమునుండి వెడలి బ్రహ్మచర్య పరిసమాప్తి సమయమునందు గృహస్థాశ్రమ స్వీకార నిమిత్తం తన స్వగృహమునకు వచ్చు సమయంలో చేసుకొను స్వయం కర్తృత్వ సంస్కారము . 

పాణిగ్రహణమ్ - (దేవ పిత్రర్ణాపగమం వివాహస్య ఫలం స్మృతం) పురుషుడు తన దేవ, పితృ ఋణములను తీర్చుకొనుటకు, ధర్మప్రజా సంపత్తికై అగ్నిసాక్షిగా కన్యక పాణిని గ్రహించుట.

వివాహమ్ వివాహమ్ - (వహనస్య వాహః, విశిష్టో వాహః) పురుషుడు ఏ వాహనముతో ధర్మ, అర్ధ, కామములాచరించి తన దేవ, ఋషి, పితృ ఋణాలుతీర్చుకుని మోక్షమునకు చేరునో అట్టి విశిష్ట వాహము వివాహము. కన్యాదాత తనతో పాటు 21 తరముల పితృదేవతలు తరించి, శాశ్వత బ్రహ్మలోక నివాస ప్రాప్తికై షోడశ మహాదానాన్తర్గత కన్యాదానమును తన గృహమున చేయును. 







No comments:

Post a Comment