Saturday, June 30, 2018

ఈ తొమ్మిదీ తింటే బరువు బహుదూరం! | NATURAL REMEDIES FOR WEIGHT LOSS / OBESITY | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ఈ తొమ్మిదీ తింటే బరువు బహుదూరం! | NATURAL REMEDIES FOR WEIGHT LOSS / OBESITY | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu || Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti | Weight Loss | Liposuction | Home Remedies for Weight Loss | Loss of Weight

    లావుగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. నలుగురిలో తొందరగా కలవలేం. నచ్చిన దుస్తులు వేసుకోలేం. వేసుకున్న దుస్తులు శరీరానికి నప్పవు. అంతేకాదు ఎక్కువ బరువు ఉండడం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే బరువు తగ్గే ఆరోగ్యకరమైన రెసిపీలను ‘వన్‌ డే మీల్‌ ప్లానర్‌’లో ఇస్తున్నాం. ఈ ప్లానర్‌లో మూడు రకాల ఆప్షన్లతో తొమ్మిది వంటకాలుంటాయి. వాటిలో మీకు నచ్చిన ఆప్షన్‌ని ఎంచుకుని ‘వెయిట్‌లాస్‌’ రెసిపీలను ఎంజాయ్‌ చేయండి... బరువు తగ్గండి.

వన్డే మీల్‌ ప్లాన్‌ (ఆప్షన్‌-1) 

ఓట్స్‌ ప్యాన్‌ కేక్‌ (ఫస్ట్‌ మీల్‌ ఆఫ్‌ ది డే)
కావలసినవి: గుడ్లు-రెండు, చక్కెర-రెండు టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎసెన్స్‌-రెండు చుక్కలు, పాలు-అరకప్పు, ఓట్స్‌ పిండి-ఒక కప్పు, వెన్న-ఒక టేబుల్‌స్పూన్‌.

తయారీ: గుడ్లను పగలగొట్టి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో పోసి బాగా గిలక్కొట్టాలి. అందులో చక్కెర, వెనీలా ఎసెన్స్‌, పాలు, ఓట్స్‌పిండి వేసి పేస్టులా చేయాలి. ఉప్పు, వెన్న కూడా ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. స్టవ్‌ మీద పాన్‌ వేడెక్కిన తర్వాత దానిపై వెన్న రాసి రెడీ పెట్టుకున్న కేక్‌ మిశ్రమాన్ని పాన్‌పై దోసెలా వేయాలి. రెండువైపులా బాగా కాలిన తర్వాత వాటిని ఒక ప్లేటులోకి మార్చి వాటిపై తేనె చల్లాలి. ఓట్స్‌ పాన్‌ కేక్‌ రెడీ.

కిన్వా బౌల్‌ (సెకండ్‌ మీల్‌ ఆఫ్‌ ది డే)
కావలసినవి: కిన్వా-ఒక కప్పు, స్వీట్‌ కార్న్‌- అర కప్పు, మొలకెత్తిన పెసలు-అర కప్పు, టొమాటో, ఉల్లిపాయ-చెరొకటి, కొత్తిమీర-సరిపడా, మిరియాలపొడి-అర టీస్పూను, ఆలివ్‌ ఆయిల్‌-ఒక స్పూను, చిల్లీ ఫ్లేక్స్‌, ఉప్పు- తగినంత, నిమ్మకాయ-ఒకటి (రసం తీసి).

తయారీ: నానబెట్టిన పెసలు, ఉడికించిన కిన్వా, స్వీట్‌ కార్న్‌, టొమాటో, ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. మరొక చిన్న గిన్నె తీసుకుని చిల్లీఫ్లేక్స్‌, ఆలివ్‌ ఆయిల్‌, ఉప్పు వేసి బాగా కలపాలి. రెడీ చేసి పెట్టుకున్న కిన్వా మిశ్రమంలో చిల్లీ ఫ్లేక్స్‌ డ్రస్సింగ్‌ వేసి కలపాలి. కిన్వా బౌల్‌ రెడీ.

క్యాబేజీ సూప్‌ (లాస్ట్‌ మీల్‌ ఆఫ్‌ ది డే)
కావలసినవి: క్యాబేజీ తురుము-ఒక కప్పు, వెల్లుల్లిరెబ్బలు-రెండు, ఉల్లిపాయ-ఒకటి, ఆలివ్‌ ఆయిల్‌-ఒక స్పూను, టొమాటో ప్యూరీ-ఒక కప్పు, ఉప్పు-తగినంత.

తయారీ: క్యాబేజీ, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాత్ర పెట్టి కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. అది వేడెక్కాక అందులో వెల్లుల్లి, ఉల్లిపాయముక్కలను వేసి వేగించాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత క్యాబేజీ తరుమును కూడా అందులో వేసి రెండు నిమిషాలు వేగించాలి. మిరియాలపొడి, ఉప్పులను కూడ అందులో వేసిన కొద్దిగా నీళ్లు పోసి పదిహేను నిమిషాలు ఉడికించాలి. టొమాటో ప్యూరీని కూడా అందులో కలిపి పది నిమిషాలు ఉడికిస్తే క్యాబేజీ సూప్‌ రెడీ.

వన్డే మీల్‌ ప్లాన్‌ (ఆప్షన్‌-2)

పాలకూర ఆమ్లెట్‌ (ఫస్ట్‌ మీల్‌ ఆఫ్‌ ది డే)
కావలసినవి: ఆలివ్‌ ఆయిల్‌-రెండు టేబుల్‌స్పూన్లు, పాలకూర కట్ట-ఒకటి, గుడ్లు-రెండు, వెల్లుల్లిపాయలు-ఆరు, నల్లమిరియాలపొడి, ఉప్పు-రుచికి సరిపడా, చిల్లీ ఫ్లేక్స్‌-తగినన్ని.

తయారీ: ముందుగా పాలకూర, వెల్లుల్లి, టొమాటోలను చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి. రెండు గుడ్లను పగలగొట్టి ఆ మిశ్రమాన్ని మరో బౌల్‌లో పోసి బాగా గిలక్కొట్టాలి. స్టవ్‌ మీద పాన్‌ పెట్టి ఆయిల్‌ వేయాలి. అది వేడెక్కిన తర్వాత వెల్లుల్లి వేసి వేగించాలి. అలాగే అందులో పాలకూర, టొమాటో ముక్కలు వే గించి ఉప్పు, మిరియాల పొడిని కూడా వేసి కలపాలి. బీట్‌ చేసి పెట్టుకున్న ఆమ్లెట్‌ మిశ్రమాన్ని పాన్‌లో వేగించిన టొమాటో మిశ్రమం మీద పోయలి. రెండు చీజ్‌ స్లైసె్‌సని ఆమ్లెట్‌ మీద పెట్టాలి. ఆమ్లెట్‌ తవా మీద కాల్చాలి. ఆమ్లెట్‌ బ్రౌన్‌ రంగులోకి వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి తీసి దానిపై చిల్లీ ఫ్లేక్స్‌ చల్లాలి. పాలకూర ఆమ్లెట్‌ రెడీ.


క్యారెట్‌ జింజర్‌ సూప్‌ (సెకండ్‌ మీల్‌ ఆఫ్‌ ది డే)
కావలసినవి: ఆలివ్‌ ఆయిల్‌-రెండు టేబుల్‌స్పూన్లు, సన్నగా తరిగిన అల్లంముక్కలు-ఒక టేబుల్‌స్పూను, ఉల్లిపాయ-ఒకటి, క్యారెట్‌-వంద గ్రాములు, చికెన్‌ స్టాక్‌- సరిపడా, ఉప్పు- తగినంత.

తయారీ: స్టవ్‌ మీద పాత్ర పెట్టి అందులో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. అది వేడెక్కిన తర్వాత అల్లం, ఉల్లిపాయముక్కలను అందులో వేసి వేగించాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్‌, మిరియాల పొడి వేసి బాగా కలిపి దానిపై మూతపెట్టి రెండు నిమిషాలు సన్ననిమంటపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత చికెన్‌ స్టాక్‌ను అందులో పోసి పదిహేను నిమిషాలు ఉడకనిచ్చి చల్లార్చాలి. అలా చల్లారిన మిశ్రమాన్ని ఒకసారి కలిపి మళ్లా స్టవ్‌ మీద రెండు నిమిషాలు ఉడికిస్తే చాలు క్యారెట్‌ జింజర్‌ సూప్‌ రెడీ.


పాలకూర చికెన్‌ సలాడ్‌ (లాస్ట్‌ మీల్‌ ఆఫ్‌ ది డే)
కావలసినవి: ఆలివ్‌ ఆయిల్‌-రెండు టేబుల్‌ స్పూన్లు, చికెన్‌- నూరు గ్రాములు, వెల్లులిముక్కలు- ఒక టేబుల్‌ స్పూను, శెనగలు-100 గ్రాములు, పాలకూర కట్ట-ఒకటి, నిమ్మరసం, ఉప్పు, నల్లమిరియాలపొడి-రుచికి సరిపడా.

తయారీ: ముందుగా పాలకూరను సన్నగా తరగాలి. స్టవ్‌పై పాత్ర పెట్టి అందులో ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత చికెన్‌, ఉప్పు, మిరియాలపొడి అందులో వేసి వేగించాలి. చికెన్‌ బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని అందులో వేసి వేగించాలి. తర్వాత పాలకూర, ఉడకబెట్టిన శెనగలను కలిపి వేగించాలి. తర్వాత కొద్ది నిమ్మరసం వేసి స్టవ్‌ మీద నుంచి దించాలి. పాలకూర చికెన్‌ సలాడ్‌ రెడీ.

వన్డే మీల్‌ ప్లాన్‌ (ఆప్షన్‌-3)

క్యాబేజీ ఆమ్లెట్‌ (ఫస్ట్‌ మీల్‌ ఆఫ్‌ ది డే)
కావలసినవి: ఆలివ్‌ ఆయిల్‌-రెండు టేబుల్‌స్పూన్లు, గుడ్లు- రెండు, క్యాబేజీ- ఒక కప్పు, పచ్చిబటాణీలు-అర కప్పు, చిల్లీ ఫ్లేక్స్‌, ఉప్పు-రుచికి సరిపడా.

తయారీ: స్టవ్‌ మీద పాన్‌ పెట్టి ఆలివ్‌ ఆయిల్‌ పోయాలి. అది వేడెక్కిన తర్వాత క్యాబేజీ, పచ్చిబఠాణీలు, చిల్లీ ఫ్లేక్స్‌ , ఉప్పు వేసి వేగించాలి. గుడ్లు పగలగొట్టి ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి బాగా గిలక్కొట్టాలి. ముందుగా వేగించి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. స్టవ్‌ మీద వేరొక పాన్‌ పెట్టి రెడీగా కలిపి పెట్టుకున్న ఆమ్లెట్‌ మిశ్రమాన్ని పాన్‌పై పోసి కాల్చాలి. రెండువైపులా బాగా కాలితే క్యాబేజీ ఆమ్లెట్‌ సిద్ధం.


లెంటిల్‌ సలాడ్‌ (సెకండ్‌ మీల్‌ ఆఫ్‌ ది డే)
కావలసినవి: ఆలివ్‌ ఆయిల్‌- రెండుటేబుల్‌స్పూన్లు, పెసర మొలకలు-కొన్ని, ఉప్పు-తగినంత, ధనియాలపొడి, జీలకర్ర పొడి, మిరియాలపొడి- ఒక్కొక్కటీ ఒక్కో పావు టీస్పూను, ఉల్లిపాయ, కేరట్‌, టొమాటో ముక్కలు -చెరొక్కొక్కటి, కొత్తిమీరఆకు- ఒక కట్ట.

తయారీ: స్టవ్‌ మీద పాన్‌ పెట్టి అందులో ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. అది వేడెక్కిన తర్వాత నానబెట్టిన పెసర మొలకలు, ఉప్పు, ధనియాలపొడి, జీలక ర్ర పొడి, మిరియాల పొడి వేసి వేగించాలి. రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, క్యారెట్‌ తురుము వేసి బాగా కలపాలి. దీన్ని వేరే ప్లేటు పెట్టి అందంగా అమర్చాలి. లింటిల్‌ సలాడ్‌ రెడీ.


మిస్ట్‌ చికెన్‌ (లాస్ట్‌ మీల్‌ ఆఫ్‌ ది డే)
కావలసినవి: ఆలివ్‌ ఆయిల్‌-రెండు టేబుల్‌స్పూన్లు, చికెన్‌-వంద గ్రాములు, ఉప్పు-తగినంత, ధనియాలపొడి, మిరియాల పొడి-ఒక్కొక్కటీ ఒక్కో పావు టీస్పూను, రెడ్‌ పెప్పర్‌-ఒకటి, శెనగలు-50 గ్రాములు, టొమాటో-ఒకటి, కొత్తిమీర కట్ట-ఒకటి, పాలకూర- ఒక కట్ట.

తయారీ: స్టవ్‌ మీద పాన్‌ పెట్టి అందులో ఆలివ్‌ ఆయిల్‌ వేయాలి. ఆయిల్‌ వేడెక్కిన తర్వాత చికెన్‌, ఉప్పు, జీలకర్రపొడి, మిరియాల పొడి వేసి వేగించాలి. చికెన్‌ వేగిన తర్వాత రెడ్‌ పెప్పర్‌, శెనగలు వేసి వేగించాలి. టొమాటో ముక్కలు, కొత్తిమీర, పాలకూర వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత వేరే ప్లేటులోకి దాన్ని మార్చాలి. మిస్ట్‌ చికెన్‌ విత్‌ కొరియాండర్‌ సిద్ధం.

No comments:

Post a Comment