ధర్మసింధు
Dharma Sindhu
Author: Kolluri Kamasastry
Pages: 552 - Rs 270/-
వేదాలలో నిర్ధేశించిన విహితకర్మలు, ధర్మాలు, ఆచరించవలసిన విధానాలు, సామాన్యులకు తెలియజేసే అపూర్వ ధర్మశాస్త్ర గ్రంథం ధర్మసింధు. ఈ గ్రంథమందు వివిధ పర్వదినముల తిధి నిర్ణయములు, విధానములు, బహువిధ శాంతి విధములు, వివాహ విషయ నిర్ణయములు, లగ్న ఫలములు, ముహూర్త నిర్ణయములు మొదలగు ఎన్నియో విషయములు ఉటంకించబడినవి.
ధర్మసింధు గ్రంథం ప్రకారము
నవగ్రహ దోషాలున్నవారు ఎలా స్నానం చేయాలి...
గజమదమూ, కుంకుమా, ఎర్ర చందనములను, నీటితో నిండిన రాగిపాత్రలో వేసి, సూర్యగ్రహ దోషాలు పోతాయి. నీటితో నిండిన పాత్రలో పట్టివేళ్లూ, గంధమూ, కుంకుమ, ఎర్ర చందనములు వేసి చంద్రుణ్ణి స్మరించి ధ్యానించి శంఖము ద్వారా స్నానం చేసిన చంద్రగ్రహ దోషాలు పోతాయి. అంగారక గ్రహ దోసాలు పోవటానికి రజిత పాత్రలో దేవదారు గ్రంధమూ, తిలలూ, ఉసిరిక పప్పు కలిపి, అంగారకుణ్ణి స్తోత్రము చేసి స్నానము చేస్తే ఆ గ్రహ దోషాలు పోతాయి. పవిత్ర సంగమస్థల జలాన్ని మట్టి నీటి పాత్రలో కలిపి స్నానము చేస్తే బుధగ్రహం సంతృప్తి చెంది దోషాలను అరికడుతుంది. బృభస్పతి గ్రహ ప్రీతి కొరకూ, దోషాల నివారణకు మారేడూ, మర్రీ, ఉసిరికా వంటి ఫలాలను బంగారు పాత్రలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే ఆ గ్రహశాంతి జరిగి దోషాలు కరిగిపోతాయి. గోరోచనమూ, వంద పుష్పాలనూ రజిత నీటిపాత్రలో వేసి శుక్రగ్రహాన్ని ధ్యానించి స్నానము చేస్తే శుక్రగ్రహ దోషాలు పోతాయి. శని దేవుని ప్రీతి కొరకూ, దోషాల నివారణకు తిలలూ, మినుములూ, గంధ పుష్పములనూ నీటితో నిండిన లోహపాత్రలో వేసి శనీశ్వరుణ్ణి ధ్యానించి స్నానం చేసిన ఆ గ్రహ దోషాలు నశిస్తాయి. హరి దళాలు పాత్రలో వేసి గేదే కొమ్ముతో రాహు గ్రహాన్ని ధ్యానిస్తూ స్నాన విధి పూర్తి చేస్తే రాహు గ్రహ ప్రీతి జరిగి దోషాలు పరిహారమగును. కేతువు గ్రహ తృప్తికీ, దోష నివారణలకూ పవిత్ర పర్వతం పైనున్న మట్టిని పాత్రలో వేసి కేతువుని ధ్యానించి స్నానం చేస్తే ఆ గ్రహదీవెనలు లబిస్తాయి. ఆ గ్రహ దోషాలు పోతాయి. .
No comments:
Post a Comment