Wednesday, June 27, 2018

గోరఖ్ పూర్ వారి మహాభారతం | Gorakhpur Gita Press | Buy Telugu (తెలుగు) - Language (भाषा) from Gita Press Book Shop | http://www.gitapress.org/ | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu




గోరఖ్ పూర్ వారి మహాభారతం | Gorakhpur Gita Press | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Geetha Geethamakarandam Bhagavadgita Bhagavathgita Mahabharatham Bharatham Bharatam Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI | Buy Telugu (తెలుగు) - Language (भाषा) from Gita Press Book Shop

గోరఖ్ పూర్ వారి మహాభారతం
‘వింటే భారతం వినాలి.. తింటే గారెలే తినాలి’ అనేది సుప్రసిద్ధ నానుడి. అంతటి మాధుర్యం ఉన్న మహాభారతం త్వరలోనే తెలుగు పాఠకులకు మరింత చేరువకానుంది. ఆధ్యాత్మిక గ్రంథాలను ముద్రించి చవక ధరల్లో అందించే గీతాప్రెస్‌ త్వరలో సంపూర్ణ మహాభారతాన్ని తేటతెలుగులో అందుబాటులోకి తేనుంది. లక్ష శ్లోకాలు, 18 పర్వాల పంచమ వేదాన్ని ఏడు సంపుటాల్లో 7248 పేజీల్లో మనముందుకు తీసుకురానుంది. భారతాన్ని 1955లో హిందీలో తొలిసారి ముద్రించిన గీతాప్రెస్‌ ఆ తర్వాత 18 సార్లు పునర్‌ ముద్రించి లక్షలాది కాపీలను పాఠకులకు చేరువ చేసింది. అయితే, హిందీయేతర భాషల్లో తొలిసారిగా తెలుగులోనే సంపూర్ణ మహాభారత ముద్రణకు గీతాప్రెస్‌ పూనుకోవడం విశేషం. డా.తిప్పాభట్ల రామకృష్ణమూర్తి, డా.సూరం శ్రీనివాస్‌ల నేతృత్వంలో 12 మంది పండితుల బృందం అనువాద ప్రక్రియను దాదాపుగా పూర్తిచేసిందని గీతాప్రెస్‌ ప్రతినిధి చెప్పారు. శ్లోకతాత్పర్యాలేకాక నీలకంఠీయ వ్యాఖ్యానాల విశేషాలను కూడా ఇందులో జతచేయడం విశేషం. కవిత్రయ విరచితమైన తెలుగుభారతంలోని పద్యాలను సందర్భోచితంగా జోడించడం ద్వారా అనువాద ప్రక్రియకు మరింతగా వన్నెలు అద్దారు. తెలుగులో సంపూర్ణ మహాభారతం సెప్టెంబరు మొదటివారంలో పాఠకులకు అందుబాటులోకి రానుందని గీతాప్రెస్‌ తెలిపింది. ఒక్కో సంపుటి రూ.400 చొప్పున ఏడు సంపుటాలకు కలిపి రూ.2800గా ధరను నిర్ణయించారు. ఆది, సభా పర్వాలతో కూడిన మొదటి సంపుటి ఇటీవలే విడుదలైంది కూడా.

No comments:

Post a Comment